శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (14:31 IST)

అనంతస్వర్ణమయం పథకం ఏమైంది: బంగారాన్ని ఏం చేశారు?

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి స్వర్ణతాపడం ప్రాజెక్టు అయిన అనంతస్వర్ణమయం పథకం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రాజెక్టు కోసం విరాళమిచ్చిన బంగారాన్ని ఏం చేశారో తెలపాలని టీటీడీ ఈవో సాంబశివరావును భక్తులు కోరారు. ఈ మేరకు కొంతమంది భక్తులు ఈవోకు లేఖలు రాశారని తెలిసింది. 
 
2008లో అప్పటి టీటీడీ చైర్మన్, దివంగత నేత డీకే ఆదికేశవులునాయుడు హయాంలో వెంకన్న ఆలయానికి బంగారుతాపడం కోసం అనంతస్వర్ణమయం పేరిట ప్రత్యేకంగా ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. డీకే ఆదికేశవులు నాయుడు పిలుపు మేరకు నాడు భక్తులు 200 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళమిచ్చారు. దీనికి సంబంధించిన పనులు జరిగినా.. 2011 ఆలయం గోడలకు ముప్పు తప్పదని అప్పటి ఈవో.. పనుల్ని ఉన్నపళంగా నిలిపేశారు. 
 
కానీ ఈ ప్రాజెక్టు పనుల కోసం వినియోగించి, మిగిలిన బంగారాన్ని ఏం చేశారని విషయాలను మాత్రం ఈవో గానీ, పాలకమండలి కానీ తెలియజేయలేదు. అనంతస్వర్ణమయం భక్తుల ప్రశ్నలకు, ఫిర్యాదులకు స్పందించిన ప్రస్తుత ఈఓ త్వరలో బంగారం వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.