శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 24 నవంబరు 2014 (20:10 IST)

డిసెంబర్ 29 నుంచి తూగోలో ధర్మరథ యాత్ర, శ్రీనివాస కళ్యాణాలు

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ ధర్మప్రచార పరిషత్ నవంబర్ 29 నుంచి  తూర్పుగోదావరి జిల్లాలో ధర్మరథయాత్ర నిర్వహించనున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తెలిపారు. ఈ యాత్ర ఒక నెల రోజుల పాటు జరుగనుందని ఆయన వివరించారు. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా జేఈవో భాస్కర్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మారుమూల ప్రాంతంలో ప్రచారం చేయడానికి ఈ రథ యాత్ర ఏర్పాటు చేసినట్టు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాకు రథాన్ని తిరుపతి నుంచి ఈ నెల 26న పంపనున్నట్లు వివరించారు. రథం గోకవరం చేరుకుంటుందని 29నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రముఖ ప్రాంతాలన్నింటిలో ఈ రథయాత్ర జరుగుతుందన్నారు. తుని లో డిసెంబర్ 7న పిఠాపురంలో డిసెంబర్ 9న,రావుల పాలెంలో డిసెంబర్ 17న రాజనగరంలో డిసెంబర్ 26న యాత్ర జరుగుతుందన్నారు. 
 
రథయాత్ర కాకుండా శ్రీనివాస కళ్యాణాలు జరుగుతాయన్నారు. రంపచౌడవరం డిసెంబర్ 3న, అమలాపురంలో ఈ నెల 18న రాజముంద్రలో 29న కళ్యాణాలు జరుగుతాయని చెప్పారు. ధర్మప్రచారం ప్రతీ గ్రామంలో జరుగుతుందన్నారు. పద్మావతీ అమ్మవారి పసుపుకుంకుమలను మహిళలకు పంపిణీ చేస్తారని చెప్పారు. రథయాత్ర వెంట భజన బృందాలు ఉంటాయని చెప్పారు. ఆ ప్రాంతాలకు చెందిన భజన బృందాలు, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు.