Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన.. ఎందుకు..?

శుక్రవారం, 7 జులై 2017 (14:30 IST)

Widgets Magazine
tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలు కొన్ని బాగానే ఉన్నా.. మరికొన్ని మాత్రం సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేసేలా చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారాంతంలో దివ్యదర్శనం టోకెన్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తితిదే నిన్న అర్థరాత్రి నుంచి అమలు చేస్తోంది. అయితే ఉన్నట్లుండి తితిదే తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు.
 
గురువారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్లను నిలిపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలినడక దర్శనానికి వెళితే త్వరితగతిన దర్శనం అవుతుందనుకుంటే చివరకు సర్వదర్శనంకు వెళ్ళాల్సిన పరిస్థితిని తితిదే తీసుకొచ్చిందని భక్తులు మండిపడ్డారు. తితిదే స్పష్టమైన ప్రకటన, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. అలిపిరి పాదాల మండపం భక్తులు ఆందోళనకు దిగారు. 
 
చంటిబిడ్డలతో వచ్చిన భక్తుల పరిస్థితి మరింత వర్ణనాతీతం. గంటలకు గంటలు నడిచి వెళ్ళి..తిరిగి గంటలకు గంటలు కంపార్టుమెంట్లలో కూర్చోవాలంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. తితిదే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Agitation Alipiri Tirumala Piligrims

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు ఈ ...

news

బాసరలో గురుపౌర్ణమి వేడుకలు... ముస్తాబైన ఆలయం

దక్షిణాదిలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయం ...

news

భర్త సిరి సంపదలు సంపాదించాలంటే... భార్య ఏం చేయాలి?

ప్రతి భార్య.. తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని ...

news

నేటి నుంచే కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల రద్దు

వారాంతపు రోజుల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ...

Widgets Magazine