పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం..?

శనివారం, 6 జనవరి 2018 (13:14 IST)

kalahasti temple hundi counting

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం తగ్గింది. శ్రీవారి వెంకన్నకు భక్తులు కాసుల వర్షం కురిపిస్తారు. అయితే పెద్ద నోట్ల రద్దు కారణంగా, ఆన్ లైన్ విరాళాలు పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం తగ్గుమఖం పట్టిందని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెల్ల‌డించింది. 2017లో హుండీ ఆదాయ వివ‌రాల‌ను ఓసారి పరిశీలిస్తే.. 2016 కంటే 2017 హుండీ ఆదాయం త‌గ్గింద‌ని తెలిపింది.
 
ఇందుకు ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన నోట్ల ర‌ద్దేనని తెలుస్తోంది. ఏడాది మొత్తానికి రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. ఈ  ఆదాయం.. 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు త‌క్కువని తితిదే వెల్లడించింది. 
 
నోట్ల ర‌ద్దు త‌ర్వాత ర‌ద్దైన నోట్ల‌ను హుండీలో వేయ‌డం వ‌ల్ల ఆదాయం తగ్గిందని టీటీడీ అధికారుల అంచనా. ఇంకా ఆన్‌లైన్‌లోనే వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు పెరిగిపోతున్నాయని వారు అన్నారు. జీఎస్టీ ఎఫెక్ట్ కూడా హుండీ ఆదాయంపై పడిందని తితిదే అధికారులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Tirumala Hundi Income Down Lord Venkateswara Goods Of Services Tax

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వెంకన్న ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల గిరుల్లో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తజనకోటి కోట్లాది రూపాయలను కానుకలుగా ...

news

ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు...?

ధనురాశిలో నుండి మకరంలోకి రవి ప్రవేశించే సమయమే ధనుర్మాసం. అయితే ఈ మాసంలో పెళ్లిళ్లు ...

news

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ... ఏప్రిల్ కోటా రిలీజ్

తిరుమల గిరుల్లో వెలసిన ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల్లో భాగంగా ఆర్జిత సేవల ...

news

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే... షిర్డీసాయి ( వీడియో)

శ్రీ గురుగీత, సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం సచాన్యోస్థి అంటే ...