గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 15 మే 2016 (12:43 IST)

గంగజాతరలో మాతంగి వేషాలు.. పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులుగా...

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ప్రధానమైన వేషం మాతంగి వేషం. పురుషులు స్త్రీలుగా, స్త్రీలు పురుషులుగా వేషధారణలు వేయడం మాతంగి వేషం ప్రసిద్ధి. అందుకే ఈ వేషానికి అంత ప్రాశస్త్యం ఉంది. పురుషులు స్త్రీలుగా చీరలు కట్టుకుని పట్టణ వీధులలో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. గంగమ్మకు మాతంగి వేషం అంటే ఎంతో ఇష్టం. అందుకే భక్తులు కూడా అంతే ఇష్టంగా ఈ వేషధారణలను ధరిస్తున్నారు.
 
మాతంగి వేషంలో శనివారం ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అధికసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేస్తున్నారు. మరోవైపు పొంగళ్లు పెట్టి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. 
 
మరోవైపు శనివారం సాయంత్రం తితిదే తరపున ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి గంగమ్మకు సారెను అందజేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి స్వయానా చెల్లెలుగా చెప్పుకునే గంగమ్మకు ప్రతియేటా సారెను అందించడం తితిదేకి ఆనవాయితీగా వస్తోంది.