శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: సోమవారం, 16 మే 2016 (12:09 IST)

తిరుపతి గంగమ్మకు పొంగళ్లతో మొక్కులు

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కొనసాగుతోంది. జాతరలో భాగంగా భక్తులు గంగమ్మకు పొంగళ్లతో నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత ఆరు రోజులుగా వివిధ వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా రేపు (మంగళవారం) ప్రధాన జాతర జరుగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రేపు తిరుపతికి చేరుకోనున్నారు. భక్తుల కోసం తిరుపతి గంగమ్మ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
 
ఆలయ ఆవరణలోనే పొంగళ్లు పెడుతూ గంగమ్మను సేవిస్తున్నారు. ఆలయంలో పొంగళ్ల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా గంగమ్మను మొక్కుతున్నారు భక్తులు. నిన్నటి నుంచే గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. 
 
సోమవారం ఉదయం సున్నపు కుండల వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకుంటున్నారు. ఇద్దరు కైకాల కులస్తులు సున్నపు కుండల వేషాన్ని మొదటగా ధరిస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మకు ప్రతీకలుగా ఈ వేషాన్ని వేస్తారు. వీరు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి హారతులను స్వీకరిస్తున్నారు. 18వ తేదీ ప్రధాన ఘట్టం విశ్వరూప దర్శనం జరుగనుంది.