శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2014 (20:39 IST)

త్వరలో తిరుపతి కోర్టుకు కొత్త భవనాలు : మంత్రి గోపాల క్రిష్ణా రెడ్డి

ప్రతీ రోజు దాదాపు రెండు వేల మంది కక్షిదారులు, న్యాయవాదులతో కిటకిటలాడుతున్న తిరుపతి కోర్టుకు త్వరలో కొత్త భవనాలను మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి గోపాలక్రిష్ణా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ, తిరుపతి కోర్టు భవనాల కోసం తిరుపతి పద్మావతీ కళ్యాణమండపాల సమీపంలో ఇప్పటికే స్థలాన్ని గుర్తించినట్లు వివరించారు. 
 
అక్కడే ఉన్న హథీరాంజీ మఠానికి చెందిన సర్వేనంబరు 54-2లో ఉన్న 10.41 ఎకరాల స్థలానికి నగదు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్లు వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన రావు మాట్లాడుతూ, భూమి అందించిన వెంటనే భవన నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 
 
మంత్రి చొరవ తీసుకుని దేవాదాయ శాఖ నుంచి భూమిని తమకు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు పి. రవి, ఛాయపతి, ధనుంజయ వర్మ, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.