Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమల వెంకన్న కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్‌ దెబ్బ

బుధవారం, 17 మే 2017 (12:34 IST)

Widgets Magazine
wannacry virus

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థను స్తంభింపజేసిన ఈ వైరస్... ఇపుడు తితిదేను తాకింది. సుమారు 20 కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే, భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు.
 
కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్‌ సోకడాన్ని సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను తితిదే వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తితిదే ఐటీ విబాగం అధికారులు వైరస్‌ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. ...

news

తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా ...

news

పాండవుల్లో ధర్మరాజే స్వర్గానికి వెళ్ళారట.. మిగిలిన వారు...?

పాండవుల్లో ధర్మారాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళారట. మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారట. ...

news

బొమ్మను దేవుడనుకుని పూజించవచ్చు... కానీ దేవుడే బొమ్మ అనుకోరాదు...

లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడిగానూ ...

Widgets Magazine