శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: బుధవారం, 28 సెప్టెంబరు 2016 (17:13 IST)

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులకు 7 లక్షల లడ్డూలు... తితిదే ఈఓ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింది. తితిదే ఈఓతో పాటు ఇద్దరు జెఈఓలు, తితిదే అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింది. తితిదే ఈఓతో పాటు ఇద్దరు జెఈఓలు, తితిదే అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జరిగే 9 రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల కోసం 7 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు తితిదే ఈఓ సాంబశివరావు మీడియాకు తెలిపారు. 
 
2వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, 11వ తేదీ వరకు రోజుకు ఒక్కో వాహనంపై స్వామివారిని విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారని తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలతో పాటు విఐపి దర్శనాలన్నింటినీ రద్దు చేశామన్నారు.
 
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ రోజు భక్తుల కోసం ప్రత్యేకంగా 30 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు.. గ్యాలరీలోకి వెళ్ళలేని భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు జరుగకుండా క్యూలైన్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.