Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (17:50 IST)

Widgets Magazine

తిరుమల శ్రీవారి దర్శనంలో బ్రేక్ ముఖ్యమైనది. సాధారణంగా టిటిడి ఎల్-1, ఎల్-2, ఎల్ -3 టిక్కెట్లను అందిస్తూ వస్తోంది. తిరుమలలోని టిటిడి జెఈఓ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకునే వ్యక్తుల క్యాడర్‌ను బట్టి ఈ దర్శనాలను ఇస్తుంటారు. అయితే ఈ దర్శనాల్లో మార్పులు తీసుకువచ్చారు టిటిడి అధికారులు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.
 
ఎల్ -1కు ఇచ్చే ప్రయారిటీని అలాగే ఉంచి, ఎల్-2, ఎల్ -3ని ఒకటిగా చేశారు. ఎల్ -1 అంటే స్వామివారికి సమీపం వరకూ అక్కడ శఠగోపం పెట్టించుకుని తిరగడం, ఎల్-2 అంటే స్వామివారి ముందు వరకు వెళ్ళి హారతి తీసుకోవడం, ఎల్-3 అంటే స్వామివారి ముందు వరకు మాత్రమే వెళ్ళడమన్నమాట. అయితే ప్రస్తుతం ఎల్-2, ఎల్-3 ఒకటే విధంగా ఉంటుందంటున్నారు టిటిడి అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపిలను త్వరితగతిన పంపించేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో అయితే ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి. సామాన్యుల రెకమెండేషన్ లెటర్లు తీసుకోరు. ఈ మొత్తం వ్యవహారం కేవలం10 వారాల పాటు మాత్రమే ఉంటుందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శని త్రయోదశికి ఏం చేయాలో తెలుసా...?

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు ...

news

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో అందుబాటులో 58,067 టిక్కెట్లు...

తిరుమల వెంకన్న భక్తులకు నిజంగానే శుభవార్త ఇది. స్వామివారి సేవా టిక్కెట్ల కోసం దళారీలను ...

news

ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే స్త్రీలూ...

భారతంలో విదురుడు చెప్పిన నీతిలో కొద్దిగా... ఒకతె మోహించిన పురుషుణ్ణే తామూ మోహించే ...

news

శ్రీవారి భక్తులూ తిరుమలలో స్వామి లడ్డూలు లేవు...?

లడ్డూలు దొరకవా... ఏంటిది.. ఎప్పుడూ వినలేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తిరుమల లడ్డూలు ...

Widgets Magazine