గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 5 మే 2016 (18:24 IST)

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో శుభప్రదం శిక్షణా తరగతులు ప్రారంభం

భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి నీతివంతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో శుభప్రదం వేసవి శిక్షణా తరగతుల బోధకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు వెల్లడించారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో గురువారం అధ్యాపకుల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 23 జిల్లాల నుంచి విచ్చేసిన 115 మంది శుభప్రదం శిక్షణా తరగతుల బోధకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మే 5వ తేదీ నుంచి 8వ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులు విద్యార్థులతో ఎలా మెలగాలి, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో భోదించే విధంగా భోదనా పద్ధతులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 8,9,10వ తరగతుల విద్యార్థులకు మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వివరించారు.