Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దర్శనం కోసం తిరుమలకు వెళ్ళాల్సిన పనిలేదు.. బయటే కనిపిస్తున్నాడు దేవుడు..?

గురువారం, 28 డిశెంబరు 2017 (17:31 IST)

Widgets Magazine

ఇదేంటి.. శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే 20 కిలోమీటర్లు వాహనంపై వెళ్ళాలి. లేకుంటే మెట్లెక్కి వెళ్ళాలి. అలాంటిది దేవుడు బయటే కనిపించేస్తున్నారేంటి అనుకుంటున్నారా. నిజమేనండి. స్వామివారి దర్శనానికి రెండురోజుల సమయం పడుతోంది. క్యూ లైన్ల ద్వారా కంపార్టుమెంట్లలోకి వెళుతున్న భక్తులకు గంటల తరబడి సమయం పడుతోంది. ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న శ్రీవారి భక్తులు గోవిందా.. గోవిందా అంటూ స్వామివారిని ముందే దర్శించేసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి.
lord venkateswara
 
వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను తెరవనున్నారు. రెండు రోజుల పాటు ఏకాదశి, ద్వాదశి రోజు ద్వారాలు తెరిచే ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే ఎంతో మంచిదని, పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలివచ్చారు. నిన్న అర్థరాత్రి కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేసింది. 
 
రేపు 7గంటల తరువాత కొద్దిసేపు విఐపిలను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తరువాత మొత్తం సర్వదర్శనమే. వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం కల్పిస్తోంది టిటిడి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

రూ.168.84 కోట్ల ఆదాయంతో శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు

శబరిమల అయ్యప్ప స్వామి కొత్త రికార్డు సృష్టించారు. భక్తులు అందించే కానుకల విషయంలో పాత ...

news

ఆడవారి జుట్టును పట్టుకుంటే అంతేసంగతులు...

భారతదేశంలో ఆడవారిని దేవతా స్వరూపులుగా భావిస్తారు. ఎందుకంటే స్త్రీలు ఎక్కడైతే ...

news

ముఖ్యమంత్రి చంద్రబాబుకి శ్రీవారి భక్తులు మొర.. ఎందుకు?

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు శ్రీనివాసుని భక్తులు మెయిల్స్ పంపుతున్నారట. ఆ ...

news

చిన్న లడ్డూ ధర రూ.50.. పెద్ద లడ్డూ ధర రూ.200

శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ...

Widgets Magazine