గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (09:30 IST)

రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి శోభ... ఉపవాస దీక్షల్లో మహిళలు...

శ్రావణమాసం.. లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా ఆరాధించే మాసం. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఆరాధించే పర్వదినమే శ్రీవరలక్ష్మీ వ్రతం. అలాంటి పవిత్రదినం నేటి శుక్రవారం. ఈ పర్వదినం సందర్భంగా బెజవాడలోని కనకదుర్గమాత ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. 
 
ఈ మాసం మహిళలకు ప్రత్యేకం. శ్రావణమాసం మొత్తం స్త్రీలు లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. అందులోనూ శ్రావణమాసం శుక్రవారం అంటే ప్రతి ఇల్లు కళకళలాడిపోతుంది. ఉదయాన్నే 4 గంటలకే మహిళలు స్నానం చేసి.... లక్ష్మీదేవిని పూజించుకుని ఇంటిని అలంకరించుకొని ఉపవాశం ఉంటుంటారు. 
 
అలాగే, వరలక్ష్మీ అంటే వరాలచ్చే తల్లి అని అర్థం. ఆ తల్లిని ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, సౌభాగ్యలక్ష్మిగా కూడా పూజిస్తుంటాం. లక్ష్మీ దేవి అంటేనే సకల సంపదలకు కొలువు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువులో సగభాగం. అందుకే స్త్రీలు వరలక్ష్మికి ప్రత్యేక పూజలు చేస్తారు.