గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (12:52 IST)

బెస్ట్ పరిశుభ్రమైన ప్రాంతంగా తిరుమల... అవార్డు ఇచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వా

వచ్చే 2018 అక్టోబర్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.  దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయమేనన్నారు. తిరుపతిలోని మహతిలో జరిగిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 
 
బెస్ట్ పరిశుభ్రమైన ఆలయంగా తిరుమల శ్రీవారి ఆలయం నిలువగా ఆ అవార్డును తితిదే అధికారులకు సీఎం అందజేశారు. అలాగే ఏపీలోని తిరుపతి, నరసారావుపేట, విశాఖపట్నం, గుంటూరుజిల్లాలు బెస్ట్ మున్సిపాలిటీలుగా నిలిచాయి. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలలో ఉన్న పరిశుభ్రతపై ప్రధాని నరేంద్ర మోడీనే మెచ్చుకున్నారంటే టిటిడి ఏ స్థాయిలో పనిచేస్తోందో అందరికీ అర్థమై ఉంటుందన్నారు. టిటిడిని ప్రతి ఒక్కరు ఆదర్సంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీలోని 110 పట్టణాలు, 1368 గ్రామపంచాయతీలను బహిరంగ మూత్ర విసర్జన రహితమైన ప్రాంతాలుగా చంద్రబాబు ప్రకటించారు.