శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 నవంబరు 2015 (14:52 IST)

బహిష్టు సమయంలో శబరిమల ప్రవేశానికి నో.. మెషీన్లు వస్తే చూద్దాం: గోపాలకృష్ణన్

శబరిమల ప్రధాన పూజారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గోపాలకృష్ణన్ వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ శబరిమల క్షేత్రంలో మహిళా ప్రవేశాన్ని అనుమతించే విషయంపై తంత్రి అయిన గోపాలకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. మహిళలు బహిష్టు సమయంలో ఉన్నారో? లేదో అని పరిశీలించే మెషీన్లను తీసుకొచ్చాక.. వారిని కూడా శబరిమల ఆలయంలోకి అనుమతించడంపై సరైన నిర్ణయం తీసుకుంటామని గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించడంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. 
 
ప్రస్తుతం సంవత్సరంలో కొద్ది రోజులు మాత్రమే మహిళలను అనుమతించట్లేదు. త్వరలోనే సంవత్సరమంతా మహిళల ప్రవేశాన్ని నిషేధించాలనే రోజులు కూడా రావచ్చు. ఏదో ఒకరోజు మహిళల శుభ్రతను గుర్తించే మెషీన్లూ వస్తాయి. 
 
అవి తెచ్చి పెట్టిన తరువాత, వారి ఆలయ ప్రవేశం గురించి ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిష్టు సమయానికి దగ్గరగా ఉన్న వారిని ఆలయంలోకి అనుమతించేది లేదని గోపాలకృష్ణన్ చెప్పారు. దీనికి వ్యతిరేకంగా హ్యాపీ బ్లీడ్ పేరిట సామాజిక వెబ్ సైట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. తంత్రి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించే విధంగా ఉన్నాయని గోపాలకృష్ణన్ వెల్లడించారు.