Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫోర్డ్... మామూలోడు కాదు... ముసుగు తొడిగిన మంచిమొగుడు... మనసు దోచిన దొంగ

మంగళవారం, 28 మే 2013 (21:04 IST)

Widgets Magazine

FILE
ఫోర్డ్ మోటారు కంపెనీల వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ అన్న సంగతి చాలామందికి తెలిసిన విషయమే అయి ఉంటుంది. కానీ అతనికి ఓ రహస్య ప్రేమాయణం ఉన్న సంగతి మాత్రం చాలామందికి తెలియదు. అమెరికన్ ప్రజల కారు కలను నిజం చేసిన ఫోర్డ్, తన కార్ల తయారీ ఫ్యాక్టరీలోనే ఉద్యోగం చేసే ఓ అమ్మాయి క్లారాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాననీ, ఆమె రాకతో తన జీవితం మారిపోయిందని చెప్పుకుంటుండేవాడు. తను ఒకే భార్యతో కాపురం చేసినట్లు ఆదర్శమైన దంపతులుగా జనం ముందు కనబడేవాడు.

కానీ రహస్యంగా అతని కంపెనీలోనే పనిచేసే ఇవాంజెల్ అనే అమ్మాయితో రొమాన్స్ నడిపాడు. ఐతే ఈ విషయం బయటకు తెలిస్తే తన ఆదర్శ దాంపత్యానికి మచ్చ పడుతుందని దానిని రహస్యంగా ఉంచాడు. అంతేకాదు ఆమెతో యధేచ్చగా రొమాన్స్ చేయాలన్న తలంపుతో తన మాట వినే మరొక వ్యక్తికిచ్చి పెళ్లి చేసి ఇవాంజెల్ ను తన ఇంటికి ప్రక్కనే ఓ అధునాతన భవనాన్ని కట్టించి ఇచ్చాడు.

విషయం ఏంటంటే, ఆ భవనంలో నుంచి ఫోర్డ్ పడకగదిలోకి ఓ రహస్య మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ రొమాంటిక్ ఫోర్డ్. మూడ్ వచ్చినపుడలా తన ప్రేయసి వద్దకు రహస్య ద్వారం నుంచి వెళ్లి ఆమెతో గడిపేవాడు. వారి కలయికకు గుర్తుగా ఇవాంజెల్ కు కుమారుడు పుట్టాడు. అప్పుడు ఫోర్డ్ తన కంపెనీలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇంత పెద్ద ఎత్తున ఫోర్డు ఎందుకు పార్టీ ఇచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆయన కాలం చేసిన తర్వాత ప్రేమాయణం సంగతి బయటపడింది. మరణించేవరకూ తన ప్రేమను అలా రహస్యంగా ఉంచగలగడం ఫోర్డ్ గొప్పతనమని చెపుతారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...

Widgets Magazine