చిత్రా.. కమానూ.... అబ్బో పిట్ట కూతకొచ్చిందే.. ఇన్ ట్రబుల్ ( వీడియో)

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
చింతామణి నాటకం పేరు చెపితే ఆంధ్రప్రదేశ్ పల్లెటూళ్లు కడుపుబ్బ నవ్వుతాయి. ముఖ్యంగా సుబ్బిశెట్టి చెప్పే డైలాగు... "కమానూ... అబ్బో పిట్ట కూతకొచ్చిందే" అనేది మారుమోగుతుంది. ఇలాంటి డైలాగులే కాదు ఎన్నో హాస్యపు గుళికలు ఆంధ్రనాట ఉర్రూతలూగిస్తుంటాయి.

ఐతే ఇప్పుడా నాటకంపై ఓ సామాజికవర్గం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారట. చింతామణి నాటకం ఆ సామాజికవర్గాన్ని కించపరిచేదిగా ఉన్నదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఆ నాటకం కేవలం హాస్యప్రధానంగా సాగుతుంది తప్ప.. ఎవర్ని కించపరిచేది కాదని కళాకారులు అంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కొంతమంది చింతామణి నాటకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐతే 80 ఏళ్లుగా పల్లెటూరి జనాన్ని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ చింతామణిపై ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తడంపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో...

సౌజన్యం: స్నేహ టీవీ9న్యూస్


దీనిపై మరింత చదవండి :