Widgets Magazine

చూచితివా చవాన్...? మా ఉసురు మిమ్ములను వెంటాడుచున్నది

Widgets Magazine

ఏంటీ.. శనివారం ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరు కూడా కనబడటం లేదు. అసలేం జరుగుతోందని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వైపుకి వెళితే... ఇదీ సంగతి...

సెక్రటరీ: " మాజీ అమాత్యులవారికి జయము.. జయము!! మీరు బాబ్లీ సందర్శనకు వెళ్లిన సమయములో అక్కడ రక్షక భటులచే మిమ్మల్ని చెరబట్టి కుళ్లబొడిచిన ముఖ్యమంత్రివర్యులకు తగిన ప్రాయశ్చిత్తము జరుగుతున్నదన్న వార్తలు నా దృష్టికి వచ్చినవి. మీరు అంగీకరించిన యెడల ఇప్పుడే ఆ దూరవాణి తెరపై ఆ దృశ్యములను మీముందు ప్రవేశపెట్టెదను.

మాజీ అమాత్యులు: ప్రవేశపెట్టుడు.

దూరవాణి తెరలో... నేనేమి చేసితినో నాకేమీ బోధపడుట లేదు. ఆకస్మికముగా నా కిరీటము గాలిలో ఎగిరిపోవుట కాంచితిని. అది ఒక్క దినమే కదా అని అనుకుంటిని. కానీ ఈ దుస్స్వప్నము కనులు మూసిన చాలు కళ్లెదుటే నిలుస్తున్నది. కుర్చీలో కూర్చున్నంతనే కుళ్లబొడుస్తున్న ఈ క్షోభను భరించలేని నేను నా రాజీనామా పత్రమును మా అధినాయకురాలికి ఇచ్చితిని.

ఎటులనూ... కిరీటము ధరించిన నేను... నాకు నేనుగా కుర్చీలో నుంచి లేచి వెళ్లలేను. గనుక నన్ను కుర్చీ నుంచి లేపే అధికారాన్ని మా అధినాయకురాలువారికి ఇచ్చి వచ్చుతుంటిని.. అంటూ చవాన్ మాటలు. ఇంతలో... వార్తావాచకుడు ప్రత్యక్షమై... మరిన్ని వివరములు తెలుసుకునేముందు ఇపుడో స్వల్ప విరామము.. ఆపై ఓ ప్రకటన...

మాజీ అమాత్యులు: సెక్రటరీ.. మిగిలిన మన మాజీఅమాత్యుల వారికినీ... ద్వితీయశ్రేణి నాయకులకును, తృతీయ.. చతుర్థ.. ఇలా అన్ని శ్రేణుల నాయకులకును ఈ శుభవార్త చెప్పుడు. వెంటనే నా సహమాజీలను లోనికి ప్రవేశపెట్టుడు.

సెక్రటరీ: చిత్తం ప్రభూ...
మాజీ అమాత్యులు: (సహమాజీలతో) చూచితిరా. కండకావరమున నాడు మనపై చేయి చేసుకున్న చవాన్ గతి ఏమైనదో. మానమర్యాదలు మరచి ప్రవర్తించిన ప్రతివానికి దేవుడు విధించు శిక్ష ఇటులనే ఉండగలదు. భవిష్యత్తులో మన నాయకులపై దాడి చేయు సాహసము మరెవరూ చేయరు. చేయలేరు. ఈ చవాన్ గుణపాఠము అందిరికీ కనువిప్పు కాగలదు.

ఇంతటితో ఈ సభను ముగించుచున్నాను. రేపటి సూక్ష్మరుణ వ్యతిరేక ఆందోళనపై మనమందరము ముందుకు పోవుదము. శెలవు.

గమనిక: ఇది కేవలం కల్పిత కథనం మాత్రమే... ఎవరినీ కించపరచటమో.. అపహాస్యం చేయటం మా ఉద్దేశ్యం కాదని గమనించగలరు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

హాస్యం

ప్రస్తుతం డ్యూటీలో లేను!

ఓ పోలీసు అధికారి ఇంటిలో అర్థ రాత్రి వేళ దొంగలు పడ్డారు. ఆ శబ్దం విన్న అధికారి భార్య ...

ఎలా భరిస్తావురా!

రామారావు : "ఉరేయ్ నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు" ?జోగారావు : ...

చదివి తిందామని!

నిరక్షరాస్యుడైన రామస్వామి తన తోటి వారి వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడురామస్వామి : "ఉరేయ్ ...

ముందే చెప్పు!

రెండు రోజులు ఆఫీసుకి రాని సురేష్‌ను మర్నాడు పిలిచిన బాస్ ఇలా అడుగుతున్నాడుబాస్ : "ఏమయ్యా ...