శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : బుధవారం, 18 మే 2016 (17:27 IST)

బాంబే స్టాక్ మార్కెట్ : నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్‌‌ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూసింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 69 పాయింట్లను కోల్పోయి 25,705 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 7,870 పాయింట్ల వద్ద ముగిసింది.
 
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.98 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 1.78 శాతం లాభపడి రూ.180 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఓఎన్‌జీసీ, లుపిన్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థల షేర్లు లాభాలు గడించాయి.
 
అలాగే బాష్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.47 శాతం నష్టపోయి రూ.21,070 వద్ద ముగిశాయి. వీటితోపాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల షేర్లు నష్టపోయాయి.