మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (17:01 IST)

బ్యాగు సర్దుకుని వచ్చేస్తా: సైనా నెహ్వాల్.. కోచ్‌ను మార్చినా నో యూజ్.. ట్విట్టర్లో?

ప్రతిష్టాత్మ ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా రాణించకపోవడంపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ విమర్శలను కూడా సైనా నెహ్వాల్ సుతిమెత్తగా కొట్టిపారేస్తోంది.

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మెరుగ్గా రాణించకపోవడంపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ విమర్శలను కూడా సైనా నెహ్వాల్ సుతిమెత్తగా కొట్టిపారేస్తోంది. రియో నుంచి సైనా నిష్క్రమించిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్ అన్షల్ సాగర్ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బ్యాడ్మింటన్‌‍లో రాణించలేకపోవడంతో సైనా నెహ్వాల్ బ్యాగ్ సర్దుకుని వచ్చేయాలని సూచించాడు. 
 
ఈ ట్వీట్స్‌పై సైనా నెహ్వాల్ సున్నితంగా స్పందించింది. తప్పకుండా అలాగే చేస్తాను. బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తాను.. సింధూ చాలా బాగా ఆడుతోంది. భారత్‌ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధును విజయం వరిస్తుందని చెప్పింది. ఆ ట్వీట్స్ చూసిన అభిమాని పశ్చాతాపపడ్డాడు. హర్ట్ చేసినందుకు సారీ. తాను బాధపెట్టడానికి ఇలాంటి ట్వీట్స్ చేయలేదని రిప్లై ఇచ్చాడు. ఇప్పటికీ సైనాకు బిగ్ ఫ్యాన్ అని సాగర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సైనా కూడా ‘నో ప్రాబ్లమ్ మై ఫ్రెండ్... ఆల్ ది బెస్ట్ టూ యూ’ అని రీట్వీట్ చేసింది.
 
కాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో సైనా నెహ్వాల్ గతంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియోలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. గతంలో ధీటుగా రాణించిన సైనా.. పుల్లెల గోపిచంద్ కోచింగ్ నుంచి సైనా నెహ్వాల్ బెంగళూరు కోచ్‌ వద్ద శిక్షణ పొందుతోంది. అయినప్పటికీ రియోలో తన సత్తా ఏంటో నిరూపించుకోలేకపోయింది. అయితే గోపిచంద్ వద్ద శిక్షణ పొందిన పీవీ సింధు మాత్రం రియోలో తన పవరేంటో చూపించింది.