శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (16:23 IST)

ఆసియా క్రీడలు : భారత్ ఖాతాలో మరో స్వర్ణం...

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో

జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ సర్నోబత్ స్వర్ణం సాధించింది. ఇది భారత్‌కు నాలుగో స్వర్ణ పతకం. దీంతో ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారత మహిళగా రహీ చరిత్ర సృష్టించింది.
 
బుధవారం జరిగిన ఫైన‌ల్ షాట్‌లో స‌ర్నోబ‌త్ మొత్తం 34 పాయింట్లు స్కోర్ చేసింది. మ‌రో ఇండియ‌న్ మ‌నూ బాక‌ర్ ఇదే ఈవెంట్‌లో ఆరో స్థానంలో నిలిచారు. స‌ర్నోబ‌త్ మొత్తం 593 పాయింట్లు స్కోర్ చేసి గేమ్స్ చ‌రిత్ర‌లో రికార్డు క్రియేట్ చేసింది. థాయిలాండ్‌కు చెందిన న‌పాస్‌వాన్.. ఫైన‌ల్లో భార‌త క్రీడాకారిణికి గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు ఇది 11వ మెడ‌ల్ కావ‌డం విశేషం.