శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:03 IST)

ఆసియా క్రీడలు : పిస్టల్‌ కేటగిరీలో స్వర్ణం సాధించిన భారత్!

ఇంచియాన్‌లో జరుగుతోన్న 17వ ఆసియా క్రీడల్లో భారత్ తొలి స్వర్ణాన్ని సాధించింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూరాయ్ పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. 
 
పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 186.2 పాయింట్లు స్కోర్ చేసి జీతూ రాయ్ ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో పతకాన్ని... మొదటి స్వర్ణాన్ని అందించాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా జీతూరాయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
అంతకుముందు ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతాచౌదరి కాంస్యం సాధించి, భారత్‌కు ఈ ఆసియా క్రీడల్లో తొలి పతకం అందించిన ఘనతను సొంతం చేసుకుంది.