గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (15:25 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి!

మెల్ బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మీర్జా జోడీ పరాజయం పాలైంది. డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా-బ్రూనో సొరెస్ (బ్రెజిల్) జోడీ పోరాటం ముగిసింది. సానియా జోడీ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్ నుంచి వెనుదిరిగింది. 
 
సానియా-సోరెస్ ద్వయం ఫ్రెంచ్-కెనడియన్ జోడీ క్రిస్టినా మ్లదనొవిక్, డానియెల్ నెస్టర్ చేతిలో 6-3, 2-6, 8-10 తేడాతో ఓడింది. మరోవైపు, భారత క్రీడాకారుడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్‌కు చేరింది.