శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (12:52 IST)

ఆస్ట్రేలియన్ ఓపెన్ : డబుల్స్‌లో సానియా మీర్జా అదుర్స్!

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అదరగొట్టింది. మహిళల డబుల్స్‌ విభాగంలో చైనీస్ తైపీ క్రీడాకారిణి సువెయ్ సీతో కలిసి ఆడిన సానియా మీర్జా తొలి రౌండ్‌లో సానియా, సీ జోడీ 6-2, 6-0 తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ బోణీ చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన రవెన్ క్లాసెన్‌తో కలిసి ఆడుతున్న అతను మొదటి రౌండ్‌లో స్కాట్ లిప్‌స్కీ, రాజీవ్ రామ్ జోడీని 6-4, 7-6 తేడాతో మట్టికరిపించాడు.