శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (14:15 IST)

గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీకి పసిడి పతకం: కొత్త రికార్డుతో అదుర్స్‌!

లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ సైనీ అదుర్స్ అనిపించాడు. గోల్ఫర్ రణ్ వీర్ సింగ్ స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో తొలిసారి పసిడి పతకం దక్కించుకున్న క్రీడాకారిడిగా చరిత్ర సృష్టించాడు. జీఎప్ లెవ్‌, ఆల్టర్ నేటి షాట్ టీమ్ ప్లే ఈవెంట్లో తన భాగస్వామి మోనికా చాజూతో కలిసి 14 ఏళ్ల రణ వీర్ ఈ ఫీట్ సాధించాడు. 
 
గుర్గావ్‌కు చెందిన ఈ క్రీడాకారుడు రెండేళ్ల వయస్సు నుంతే ఆటిజంతో బాధపడుతున్నాడు. అయితే తొమ్మిదేళ్ల వయసు నుంచి రణ్ వీర్ సింగ్ సైనీ గోల్ఫ్ ఆడుతున్నాడు. గతంలో జరిగిన ఆసియా ఫసిఫిక్ వరల్డ్ గేమ్స్‌లో రెంజు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారతీయుడిగా కూడా రికార్డు సృష్టించాడు.