శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (14:47 IST)

సరిత సస్పెండ్: నిరసన ప్లస్ మెడల్ వెనక్కి ఇచ్చినందుకేనట!

భారత బాక్సర్ సరితాదేవిపై ఏబబీఏ సస్పెన్షన్ వేటు వేసింది. రిఫరీలు అన్యాయం చేశారంటూ సరితాదేవి నిరసన వ్యక్తం చేయడంతో పాటు కాంస్య పతకాన్నితిరిగి ఇచ్చేసిన ఘటనకు సంబంధించి ఏఐబీఏ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఫలితంగా సరితాదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది.
 
దక్షణి కొరియాలోని ఇంచియాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్ సెమీ ఫైనల్లో రిఫరీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దక్షిణ కొరియా బాక్సర్ జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారని సరితాదేవి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతేగాకుండా.. బౌట్‌లో సరితా పూర్తి ఆధిక్యం కనబరిచినా జడ్జీలు జినా పార్క్ గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై అప్పీల్ చేసినా ప్రయోజనం లేదు. 
 
కాంస్య పతకం తీసుకునేందుకు పోడియం వద్దకు పిలిచినప్పటి నుంచి సరితాదేవి ఏడుస్తూనే ఉంది. పతకం తీసుకోవడానికి కూడా నిరాకరించి దానిని రజత పతకం సాధించిన జినా పార్క్‌కే ఇచ్చేసింది. దీంతో షాక్‌కు గురైన జీనా ఏం చేయాలో తెలియక... పోడియం వద్ద ఉంచి ఆమె కూడా వెళ్లిపోయింది.
 
దీంతో ఆ కాంస్య పతకాన్ని ఆసియా గేమ్స్ నిర్వహకులు తమ వద్దే ఉంచుకున్నారు. ఒకటిన్నర సంవత్సరాల బాబును కుడా వదలిపెట్టి కఠోరమైన శిక్షణ తీసుకున్నానని, చివరకు తన కొడుకు కూడా ఒకదశలో తనన్ని గుర్తు పట్టలేకపోయాడని సరితా దేవి వాపోయింది. దీని తర్వాత ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు సరితాదేవి వెల్లడించింది.