శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:38 IST)

కరోలినా మారిన్ సరికొత్త రికార్డు: లీపై గెలుపు

చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ రికార్డు సృష్టించింది. 
 
మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది. తద్వారా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
 
మరోవైపు సెమీస్‌లో ఓడిన భారత యువ సంచలనం పి.వి.సింధు, మినత్సు మితాని (జపాన్)లకు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)కి మూడోసారీ నిరాశే ఎదురైంది. ఫైనల్లో రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా) 21-19, 21-19తో లీ చోంగ్ వీపై గెలిచి తొలిసారి ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.