తల్లిని కాబోతున్నా.. 2020 ఒలింపిక్స్‌‌పై సానియా మీర్జా ఏమందో తెలుసా?

శనివారం, 12 మే 2018 (11:25 IST)

సానియా మీర్జా తల్లి కాబోతున్న వేళ.. ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా అనే దానిపై చర్చ మొదలైంది. డబుల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో వున్న సానియా మీర్జా.. ప్రస్తుతం గర్భవతి. 2010లో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా.. గత నెలలో తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని ప్రకటించింది. దీంతో టెన్నిస్‌కు దూరంగా వుండనున్నట్లు సానియా మీర్జా తెలిపింది. 
 
మోకాలి గాయం నుంచి కోలుకున్నాక.. తల్లి కాబోతున్న ఆనందాన్ని ఆస్వాదించాక.. టెన్నిస్‌ ఆడుతానని.. కానీ అందుకు ఆరేడు నెలల సమయం పట్టే అవకాశం వుందని చెప్పింది. గాయం కారణంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 
 
దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమవుతున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2020 ఒలింపిక్స్‌లో మెరుగ్గా ఆడుతానా అనేది ప్రసవం తర్వాత నిర్ణయిస్తానని.. అయినా ప్రాధాన్యత పరంగా బరిలోకి దిగుతానని తెలిపింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఆసియా బ్యాడ్మింటన్: సెమీఫైనల్లో అడుగెట్టిన సైనా నెహ్వాల్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా ...

news

భారతీయుల గుండెల్లో బాధను నింపాను.. సాయం చేయండి: పాక్ హాకీ స్టార్ మన్సూర్

పాకిస్తాన్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్.. మూడు ఒలింపిక్ పతకాలను సాధించాడు. ...

news

తల్లికాబోతున్న సానియా... ఇక టెన్నిస్‌కు టాటా?

హైదరాబాద్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె ...

news

కామన్వెల్త్ గేమ్స్: ముగిసిన భారత పోరు.. 66 పతకాలతో 3వ స్థానంలో ఇండియా

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పోరు ముగిసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ...