గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (12:53 IST)

కామన్వెల్త్ గేమ్స్: ముగిసిన భారత పోరు.. 66 పతకాలతో 3వ స్థానంలో ఇండియా

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పోరు ముగిసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 66 పతకాలు లభించాయి. తద్వారా భారత్ పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ 66 పతకాల్లో

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పోరు ముగిసింది. గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 66 పతకాలు లభించాయి. తద్వారా భారత్ పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ 66 పతకాల్లో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలున్నాయి. పురుషుల విభాగంలో 13 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు రాగా, మహిళల విభాగంలో 12 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు, మిక్స్‌డ్‌ విభాగంలో 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్య పతకం వచ్చింది.
 
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తన ఖాతాలో 26 స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో అథ్లెటిక్ విభాగంలో ఒకటి, బ్యాడ్మింటన్‌ విభాగంలో రెండు, బాక్సింగ్‌లో మూడు స్వర్ణ పతకాలు రాగా, షూటింగ్ విభాగంలో ఏడు పతకాలు, టేబుల్ టెన్నిస్‌లో మూడు స్వర్ణాలు.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఐదు, రెజ్లింగ్‌లో ఐదు స్వర్ణ పతకాలు వచ్చాయి.
 
అలాగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 20 రజత పతకాలను క్రీడాకారులు సాధించారు. ఇందులో అథ్లెటిక్స్‌లో ఒకటి, బ్యాడ్మింటన్‌లో మూడు, బాక్సింగ్‌లో మూడు రజత పతకాలు, షూటింగ్‌లో నాలుగు, స్క్వాష్‌‌లో రెండు, టేబుల్‌ టెన్నిస్‌లో రెండు రజత పతకాలు, వెయిట్‌ లిఫ్టింగ్‌లో రెండు, రెజ్లింగ్‌లో మూడు రజత పతకాలు వచ్చాయి. అలాగే కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ సాధించిన మొత్తం 66 పతకాలలో 20 కాంస్య పతకాలు ఉన్నాయి.