Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్విట్టర్‌ పందెంలో ఓడిన సూపర్ బ్యూటీ... ముక్కూమొహం తెలియని అభిమానితో డేటింగ్‌కు సిద్ధం

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (19:07 IST)

Widgets Magazine
Eugenie Bouchard

కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ యుజిని బౌచర్డ్‌. వయసు 22 యేళ్లు. ఈమె సూపర్‌ బౌల్‌ సిరీస్‌లోని అట్లాంటా ఫాల్కన్స్‌- న్యూఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ట్విట్టర్‌లో ఓ అభిమానితో పందెం కాసింది. ఈ పందెంలో ఓడిపోయింది. పందెంలోని బెట్టింగ్ ఒప్పందం మేరకు.. ఆ అభిమానితో డేటింగ్‌ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అట్లాంటా ఫాల్కన్స్‌ 21-0తో లీడ్‌లో ఉండటంతో బౌచర్డ్‌ ట్విట్టర్‌లో అట్లాంటా జట్టు మ్యాచ్‌ గెలుస్తుందని ట్వీట్‌ చేసింది. అయితే ఓ అభిమాని పేట్రియాట్స్‌ జట్టు గెలిస్తే నాతో డేట్‌కు వస్తావా అని అడిగాడు. అందుకు బౌచర్డ్‌ 'తప్పకుండా' అని సమాధానమిచ్చింది. అయితే సూపర్‌స్టార్‌ టామ్‌ బ్రాడీ అద్భుతమైన ఆటతో అనూహ్యంగా పేట్రియాట్స్‌ విజయం సాధించింది. దీంతో ఆ అభిమాని 'ఆందోళన పడుతున్నారా?' అంటూ ట్వీట్‌ చేశాడు.
 
'అవును.. కొంచెం..' అని సమాధానమిచ్చి 'నువ్వు ఎక్కడ ఉంటావ్‌?' అని బౌచర్డ్‌ అడిగింది. తర్వాత తాను అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని డేట్‌ తర్వాత ట్వీట్‌ చేసింది. అలాగే టామ్‌ బ్రాడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ బెట్‌ వేయొద్దని గొప్ప గుణపాఠం కూడా నేర్చుకున్నానంటూ బౌచర్డ్‌ మరో ట్వీట్‌ ద్వారా తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Fan Patriots Eugenie Bouchard Blind Date Super Bowl Twitter Bet

Loading comments ...

ఇతర క్రీడలు

news

కుదిరితే రణబీర్‌ను పెళ్లాడుతా... అవకాశం వస్తే షాహిద్‌ను చంపేస్తా : సానియా మీర్జా

భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాకు బాలీవుడ్ హీరో ...

news

2020 ఒలింపిక్స్ మెడల్స్.. పాతబడిన మొబైల్ ఫోన్స్ నుంచి తయారవుతాయా?

2020 ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమవుతోంది. టోక్యో వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో ...

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిన సానియా మీర్జా

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ ...

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. అక్కపై వీనస్‌ను మట్టికరిపించి చెల్లాయి టైటిల్ కొట్టేసింది..

అమెరికా నల్ల కలువల సమరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ...

Widgets Magazine