శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 3 మే 2015 (11:21 IST)

ప్రపంచ బాక్సింగ్ టైటిల్... మేవెదర్ కైవసం...!

ప్రపంచ బాక్సింగ్ టైటిల్‌ను అమెరికా దిగ్గజం కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ కైవసం చేసుకున్నాడు. వరల్డ్ బాక్సింగ్ చరిత్రలో రూ. 2500 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టి, అత్యంత ఖరీదైన పోరుగా, ఫైట్ ఆఫ్ ది సెంచరీగా నిలిచిన 'బిగ్ ఫైట్'లో అమెరికాకు చెందిన కింగ్స్‌ ఫ్లాయిడ్ మేవెదర్ విజయం సాధించారు. ఫిలిప్పీన్స్ కు చెందిన మ్యానీ పాకియోతో జరిగిన ఈ పోరులో మొత్తం 12 రౌండ్ల పాటు పోటీ జరుగగా, న్యాయనిర్ణేతలు మేవెదర్ గెలిచినట్టు ఏకగ్రీవంగా ప్రకటించారు.  
 
న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని మేవెదర్ అద్భుత ఆటగాడని పోటీ అనంతరం పాకియో వ్యాఖ్యానించారు. కాగా, ఎవరో ఒక ఆటగాడు నాకౌట్ అవుతాడని ఆశించిన బాక్సింగ్ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. ఈ పోటీ ద్వారా మొత్తం రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం లభించింది. కాగా ఈ పోటీ ద్వారా వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన మొత్తంలో 60 శాతం మేవెదర్, 40 శాతం పాకియోలకు ఇవ్వాలని ముందుగానే ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.