గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జూన్ 2016 (11:07 IST)

ఫ్రెంచ్ ఓపెన్‌లో సెరెనాకు చుక్కెదురు.. విజేతగా అవతరించిన ముగురుజా!

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విభాగంలో అనూహ్యంగా అమెరికన్ క్రీడాకారిణి, డిఫెండింగ్ ఛాంపియన్ సెరెనా విలియమ్స్ ఓడిపోయింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సెరెనా విలియమ్స్ ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఫలితంగా స్పెయిన్‌కు చెందిన గార్బైన్ ముగురుజ విజేతగా నిలిచింది.  
 
సింగిల్స్ ఫైనల్లో 7-5, 6-4 తేడాతో ముగురుజ టైటిల్ సాధించింది. నాలుగో సీడ్‌గా ఈ పోటీల బరిలోకి దిగిన ముగురుజ తన కెరీర్‌లో అత్యుత్తమ టైటిల్ గెలుచుకుంది. ఇంకా 1998 తరువాత ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన స్పెయిన్ దేశపు అమ్మాయిగా ముగురుజా రికార్డ్ సాధించింది.
 
అంతకుముందు ఆ దేశానికి చెందిన శాంచెజ్ వికారియో 1998లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. అయితే ఈ పోరులో సెరెనా నుంచి గట్టిపోటీని ఎదుర్కొన్న ముగురుజ తొలుత ఒత్తిడికి లోనైనప్పటికీ ఆమె కోలుకుని.. మ్యాచ్‌ను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.