మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (16:19 IST)

ఢిల్లీ విద్యార్థిని గుర్‌మెహర్‌కు యోగేశ్వర్ దత్ ప్రశ్న.. పాక్ ఎవరిని చంపినట్లు?

ఢిల్లీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్‌పై చేసిన ట్వీట్లను ఒలింపియన్ యోగేశ్వర్ దత్ వెనక్కి తీసుకోలేదు. ఇంకా సమర్థించుకున్నాడు. గుర్‌మెహర్ అమరవీరుడి కుమార్తె. తాను ఆమెకు వ్యతిరేకం కాదు. అయితే ఆమె అభిప్రాయా

ఢిల్లీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్‌పై చేసిన ట్వీట్లను ఒలింపియన్ యోగేశ్వర్ దత్ వెనక్కి తీసుకోలేదు. ఇంకా సమర్థించుకున్నాడు. గుర్‌మెహర్ అమరవీరుడి కుమార్తె. తాను ఆమెకు వ్యతిరేకం కాదు. అయితే ఆమె అభిప్రాయాలతో విభేదించానని యోగేశ్వర్ దత్ క్లారిటీ ఇచ్చాడు. భారత జవాన్లను పాకిస్థాన్‌ కాకపోతే ఎవరిని చంపినట్లు అంటూ ప్రశ్నించారు. 
 
మనం పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్నాం.. అవునా కాదా? అంటూ యోగేశ్వర్ ప్రశ్నించారు. ''మా నాన్నను పాకిస్థాన్‌ చంపలేదు.. యుద్ధం చంపింది" అంటూ గుర్మెహర్‌ ఏడాది క్రితం పోస్టు చేసిన వీడియోపై వీరేంద్ర సెహ్వాగ్‌ ఒక పోస్టు పెట్టారు. ఆయనకు మద్దతుగా యోగేశ్వర్‌దత్‌ కూడా ట్విట్టర్లో ఓ పోస్టరును ట్వీట్ చేశారు దీనికి యోగేశ్వర్ దత్ వివరణ కూడా ఇచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. 'ఢిల్లీ యూనివర్సిటీని కాపాడండి' అనే నినాదంతో నిర్వహిస్తున్న ర్యాలీలో అందరూ పాల్గొనాలని గుర్మెహర్‌ కౌర్ కోరారు. ఈ ప్రచారం నుంచి నేను తప్పుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. నన్ను ఇక ఒంటరిగా వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కౌర్ వెల్లడించారు. 
 
కాగా.. గుర్మెహర్ కౌర్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మద్దతు పలికారు. నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న నిన్ను చూసి దేశం గర్విస్తోందంటూ చెప్పారు. వాక్ స్వాతంత్ర్య మన హక్కు అని రాబర్ట్ వాద్రా చెప్పుకొచ్చారు.