శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 14 ఆగస్టు 2014 (19:42 IST)

అర్జున అవార్డులకు 15 మంది.. అదీ ఒక్క రాష్ట్రం నుంచే!

15 మందిని అర్డున అవార్డులను సిఫార్సు చేస్తే.. అందులో అధికశాతం మందిని ఒక్క కేరళ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారని హాకీ సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా ప్రశ్నించారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అర్జున్ అవార్డులకు నియమించబడ్డ కమిటీ చేసిన సిఫార్సులపై వివాదం చెలరేగుతోంది. 
 
అత్యున్నత క్రీడాకారులను మాత్రమే ఖేల్ రత్న ఎంపిక చేయాలని కపిల్ కమిటీ సిఫార్సుచేసినా.. ఒక్క రాష్ట్రం నుంచి ఐదుగురు క్రీడాకారులను అర్జున అవార్డుకు సిఫార్సు చేయడం కాస్తా విమర్శలకు తావిస్తోంది.
 
15 మంది ఎంపిక ఎలా జరిగిందో చెప్పాలని కపిల్ కమిటీని నిలదీశారు.  తాము హాకీ నుంచి పంపిన ఏడుగురు ఆటగాళ్ల పేర్లలో ఏ ఒక్కరిని అర్జునకు సిఫార్సు చేయలేదని మండిపడ్డారు.

ప్రస్తుతం కపిల్ కమిటీలో ఉన్న మాజీ హాకీ ఆటగాడు అనుపమ్ గులాటీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని బత్రా తెలిపారు.