Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రికెట్‌లో పోయిన పరువును హాకీలో నిలిపారు. పాక్‌ను చిత్తుగా ఓడించారు. దాయాదిపై అతి పెద్ద విజయం

హైదరాబాద్, సోమవారం, 19 జూన్ 2017 (04:10 IST)

Widgets Magazine

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాపై పాక్ సంచలన విజయానికి బదులు చెబుతున్నట్లుగా భారత హాకీ టీమ్ లండన్ లోనే జరిగిన ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్లో పాకిస్తాన్ హాకీ జట్టుపై ఘనవిజయం సాధించి ఫైనల్ చేరుకుంది. హాకీ చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ గెలుపుతో భారత్‌ తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ఇటీవల పాక్‌ ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత సైనికులకు నివాళిగా మన ఆటగాళ్లు భుజాలకు నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు.    
 
మొత్తం మీద పాకిస్తాన్‌పై భారత్‌కు ఇదే భారీ విజయం. గతంలో చాంపియన్స్‌ ట్రోఫీ (2003), కామన్వెల్త్‌ గేమ్స్‌ (2010)లలో భారత్‌ 7–4 గోల్స్‌ తేడాతో నెగ్గింది. మంగళవారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు నెదర్లాండ్స్‌తో ఆడనుంది. డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (13, 33వ నిమిషాల్లో), తల్వీందర్‌ సింగ్‌ (21, 24వ ని.లో), ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (47వ, 59వ ని.లో) రెండేసి గోల్స్‌ చేయగా... ప్రదీప్‌ మోర్‌ (49వ ని.) ఒక గోల్‌ సాధించాడు. పాక్‌ నుంచి ఉమర్‌ భుట్టా (57వ ని.లో) ఏకైక గోల్‌ సాధించాడు. మ్యాచ్‌ ఆరంభంలో పాక్‌ కాస్త జోరును ప్రదర్శించినా ఆ తర్వాత మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ చేతుల్లోకి వచ్చింది.
 
మ్యాచ్‌ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా భారత హాకీ టీమ్ ప్రత్యర్థి పాక్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది. ఇటీవలి కాలంలో పాక్‌ ఉగ్రవాదుల చేతిలో అమరులైన భారత సైనికుల మృతికి నివాళిగా హాకీ ఆటగాళ్లు తమ భుజానికి నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు. భారత ఆర్మీకి హాకీ ఆటగాళ్లు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్‌ ముష్తాక్‌ అహ్మద్‌ అన్నారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రపంచ హాకీ భారత్ ఫాక్ ఘనవిజయం Pakistan India 7-1 Hockey World League Semi-final

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్

తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌‌లో విజేతగా ...

news

ఫ్రెంచ్ ఓపెన్ : రఫెల్ నాదల్ ఖాతాలో పదో టైటిల్

ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన ఖాతాలో పదో ...

news

జమైకా చిరుత చివరి పరుగు.. సొంత మైదానంలో రిటైర్మెంట్ తీసుకున్న బోల్ట్

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. ...

news

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ...

Widgets Magazine