శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (12:30 IST)

మైక్ టైసన్‌ను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాడట!

మైక్ టైసన్‌ను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాడట! ఇదేంటి నిజమా? అనుకుంటున్నారా.. అవునండి. మైక్ టైసన్... అభిమానులు మైక్ 'ఐరన్' టైసన్ అని గర్వంగా పిలుచుకుంటారు. 
 
హెవీ వెయిట్ బాక్సింగ్ రింగ్‌లో కండలు తిరిగిన టైసన్ ముష్ఠిఘాతాలకు నేలకొరగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి యోధుడైన టైసన్ కూడా ఒకసారి భయంతో బెదిరిపోయాడట. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు న్యూయార్క్ వీధిలో వెళుతుండగా ఒక పెద్దాయన ఆపి లైంగికంగా వేధించాడట. 
 
అప్పుడు చాలా భయపడ్డానని ఆ తర్వాత ఆ వ్యక్తి ఎప్పడూ కనపడలేదని టైసన్ తెలిపాడు. ఆ అనుభవం మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని టైసన్ చెప్పాడు.