Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిలు అదుర్స్‌ : ఆసియాకప్‌ విజేత భారత్‌

సోమవారం, 6 నవంబరు 2017 (09:01 IST)

Widgets Magazine
asia cup 2017

భారత హాకీ మహిళలు దుమ్మురేపారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. తిరుగులేని ప్రదర్శనతో ఆసియాకప్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించారు. ఆదివారం జపాన్‌లోని కకామిగహరలో నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫైనల్లో భారత్‌ షూటౌట్‌లో 5-4తో చైనాను చిత్తుచేసింది. 
 
నవ్‌జ్యోత్‌ కౌర్‌ (25వ నిమిషంలో)గోల్‌ చేయడంతో తొలుత టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తియాన్‌తియాన్‌ లువో (47వ ని)లో గోల్‌ కొట్టడంతో చైనా 1-1తో స్కోర్‌ సమంచేసింది. మ్యాచ్‌ ముగిసేసరికి మరో గోల్‌ నమోదు కాకపోవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌ రెండు జట్లు 4-4తో నిలిచాయి.
 
చివరి అవకాశంలో కెప్టెన్‌ రాణి గోల్‌ కొట్టింది. ఆ తర్వాత చైనా విఫలంకావడంతో భారత్‌ 5-4తో చైనాకు షాకిచ్చింది. గ్రూప్‌ దశలోనూ చైనాను భారత జట్టు చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ టోర్నీలో అమ్మాయిల జట్టు అద్భుతంగా ఆడింది. గ్రూప్‌ దశను అజేయంగా ముగించింది. క్వార్టర్‌లో కజకిస్థాన్‌పై గెలిచింది. సెమీ ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌ను మట్టికరిపించింది. 
 
ఉత్కంఠతగా సాగిన మ్యాచ్‌లో చైనాను ఓడించి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఆసియాకప్‌ గెలిచినట్టైంది. ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ 2018లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత పొందింది. 2004 తర్వాత అమ్మాయిలు ఆసియాకప్‌ గెలవడం ఇదే తొలిసారి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

అజితేష్ అసభ్యంగా ప్రవర్తించాడు.. సింధు : ఇంకొక్కమాట చెప్పకంటున్న నెటిజన్స్

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ...

news

ఫ్రెంచ్ ఓపెన్ : తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌ విజేతగా తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ...

news

ప్రో కబడ్డీ 2017: గుజరాత్‌ను చిత్తు చేసిన పాట్నా పైరేట్స్

ప్రొ కబడ్డీలో కొత్త రికార్డు పాట్నా పైరేట్స్ నెలకొల్పింది. చెన్నై వేదికగా జరిగిన ప్రొ ...

news

సింధు ప్రతీకార విజయం : తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లోకి

గతవారం డెన్మార్క్‌ ఓపెన్‌లో తడబడిన పీవీ సింధు తన తప్పిదాలను సరిచేసుకొని ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ...

Widgets Magazine