గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (15:11 IST)

ఐఎస్ఎల్ -2 పోటీలు : తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం

ఇండియన్ సూపర్ లీగ్ రెండో అంచె మొదటి పోటీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అట్లెటికో డి కోల్‌కతా శుభారంభం చేసింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా 3-2తో చెన్నయిన్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. పోర్చుగల్‌ మాజీ ఆటగాడు హెల్డర్‌ పొస్టిగా (13, 70వ నిమిషాలు) అరంగేట్రంలోనే రెండు గోల్స్‌తో అట్లెటికో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సబ్‌స్టిట్యూట్‌ స్పానిష్‌ స్ట్రయికర్‌ వాల్డో (79) మరో గోల్‌ చేశాడు.
 
 
అయితే, చెన్నైయిన్ జట్టులో జేజే (31), కెప్టెన్‌ ఎలానో బ్లూమర్‌ (89) చెరో గోల్‌ చేసినప్పటికీ.. ఓటమి తప్పలేదు. ఆట ప్రారంభం నుంచి అట్లెటికో దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థి జట్టును నిలువరించింది. దీనికితోడు 13వ నిమిషంలోనే పొస్టిగా కీపర్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో.. కోల్‌కతా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 33వ నిమిషంలో చెన్నయిన్‌ ఆటగాడు జేజే గోల్‌ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. 
 
ఆట చివర్లో పొస్టిగా, వాల్డో చెరో చేయడంతో అట్లెటికో ఆధిక్యం 3-1కి పెరిగింది. కాగా, 11 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా చెన్నయిన్‌ కెప్టెన్‌ ఎలానో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే కోల్‌కతా ఆట చివరి వరకూ తన ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలీకృతం కావడంతో ఆరంభ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు విజయభేరీ మోగించింది.