Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సానియా మీర్జాకు కొత్త జోడీ- కొత్త పార్ట్‌నర్‌ ష్వెదోవాతో ధీటుగా రాణిస్తాం..

ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (11:12 IST)

Widgets Magazine

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్‌లో రాణించేందుకు రెడీ అయ్యింది. డబుల్స్ విభాగంలో మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన యరోస్లవా ష్వెదోవాతో జోడీ కట్టినట్లు సానియా తెలిపింది. స్విట్జర్లాండ్‌ స్టార్‌ మార్టినా హింగిస్‌తో విడిపోయిన తర్వాత చెక్‌ రిపబ్లిక్‌ ప్లేయర్‌ బార్బరా స్ట్రికోవాను సానియా తన డబుల్స్‌ పార్ట్‌నర్‌గా ఎంచుకుంది. 
 
అయితే ఈ సీజన్లో వీరిద్దరూ పెద్దగా రాణించలేకపోవడంతో కొన్ని వారాల క్రితమే విడిపోయారు. సింగిల్స్‌లో బాగా రాణిస్తున్న బార్బరాకు డబుల్స్‌ ఆడడం కష్టమై పోయిందని మీర్జా చెప్పింది. ఇద్దరం అవగాహనతోనే బ్రేక్‌ చేసుకున్నామని తెలిపింది. కొత్త పార్ట్‌నర్‌ ష్వెదోవా ఆటపై మీర్జా ఆశాభావం వ్యక్తం చేశారు. సానియా-  బార్బరా జంట పది టోర్నీలు మాత్రమే ఆడింది. 
 
ష్వెదోవా కోర్టు బ్యాక్‌ హ్యాండ్‌ సైడ్‌ ప్లేయర్‌. కొత్త భాగస్వామితో మరిన్ని విజయాలు సాధిస్తానని సానియా ఆశాభావం వ్యక్తం చేసింది. వింబుల్డన్‌ వరకు ఇద్దరం కలసి ఆడతామని.. బహుశా సీజన్‌ మొత్తం కూడా ఆడే అవకాశాలున్నాయని చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

సింగపూర్ సూపర్ సిరీస్ టైటిల్‌పై కన్నేసిన పీవీ సింధు.. గట్టిపోటీ దిగనుందా?

హైదరాబాదీ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న ...

news

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా ...

news

ఎన్నో మార్పులొచ్చాయ్... టెన్నిస్‌కు పాతదాన్ని అయిపోయా: సానియా మీర్జా

తనకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన టెన్నిస్ క్రీడ పట్ల ...

news

సాహో.. సింధు... వరుస విజయాలతో దూకుడు... రియో ఓటమికి ప్రతీకారం

విశ్వక్రీడల్లో బంగారు కలను ఛిద్రం చేసిన కరోలినా మారిన్‌ను దెబ్బకు దెబ్బ కొట్టాలన్న కసి..! ...

Widgets Magazine