శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (14:25 IST)

అప్పట్లో తొందరపడ్డా... ఇప్పుడు ఐస్ బకెట్ నా లక్ష్యం... గుత్తా(వీడియో)

టెన్నిస్‌ ప్లేయర్‌గా పాపులర్‌ పొందిన గుత్తా జ్వాల.. అప్పట్లో నితిన్‌ కోరిక మేరకు 'గుండెజారి గల్లంతయిదే'లో పబ్‌ డాన్స్‌లో నటించింది. దాని తర్వాత ఆమెకు ఛాన్స్‌లు పెద్దగా రాలేదు. అందులో తనను సరిగ్గా చూపించలేదని వాపోతుంది. ఇక సినిమాల వైపు వెళ్ళను. నా దృష్టంతా ఆటపైనే అని చెబుతోంది. 
 
ఇటీవలే ఆమె హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చింది. ఎఎల్‌ఎస్ అనే సంస్థ నరాల వ్యాధితో బాధపడేవారి కోసం ఫండ్‌ను రైజ్‌ చేసే కార్యక్రమంలో భాగంగా 'ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌' పేరుతో చన్నీటి స్నానం కాస్సెప్ట్‌ చేపట్టింది. 
 
బాలీవుడ్‌లో అభిషేక్‌బచ్చన్‌, రితేష్‌ సపోర్ట్‌ చేస్తుంటే తెలుగులో హన్సిక, గుత్తా దీన్ని పాపులర్‌ చేసే పనిలో వున్నారు. సినిమాల్లో తనకూ అభిమానులున్నారనీ వారితో చేయిస్తానని అంటోంది. వారి పేర్లు త్వరలో చెబుతానంటోంది.