శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (10:46 IST)

జాతీయ బ్యాడ్మింటన్ ఆడటం వల్లే.. నెం.1 ర్యాంక్ పోయింది: శ్రీకాంత్

భారత ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడటం వల్లే తాను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయినట్లు.. శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. బీడబ్ల్యూఎఫ్ పు

భారత ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడటం వల్లే తాను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయినట్లు.. శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. బీడబ్ల్యూఎఫ్ పురుషుల సింగిల్స్‌లో తాను తొలి స్థానానికి చేరకపోవడానికి నేషనల్ లెవల్‌లో జరిగిన బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్పే కారణమని చెప్పాడు.
 
ఈ ఏడాది డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో విజేతగా నిలిచిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకును సాధించిన శ్రీకాంత్.. ఆపై చైనా, హాంకాంగ్ ఓపెన్‌లలో రాణించివుంటే నెంబర్ వన్ ర్యాంకు సొంతమయ్యేది. 
 
కానీ మధ్యలో జాతీయ బ్యాడ్మింటన్ ఆడిన సమయంలో శ్రీకాంత్ గాయానికి గురైయ్యాడు. తాను అయిష్టంగానే దేశవాళీ టోర్నీలో ఆడానని చెప్పకనే చెప్పిన శ్రీకాంత్, సూపర్ సిరీస్‌లో తాను మరింత మెరుగ్గా ఆడాల్సివుందని వ్యాఖ్యానించాడు. విశ్రాంతి లేని షెడ్యూల్, గాయాల ప్రభావంతో వరల్డ్ సూపర్ సిరీస్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించాడు. దీంతో నెంబర్ వన్ ర్యాంక్ చేజారిపోయిందని శ్రీకాంత్ తెలిపాడు.