Widgets Magazine

మేరీకోమ్ అదుర్స్.. పోలాండ్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (15:25 IST)

భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ మరోసారి తన సత్తా ఏంటో చాటుకుంది. పోలాండ్‌లో జరుగుతున్న సిలిసియన్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మేరీకోమ్ తన బలం ఏంటో నిరూపించుకుంది. 48 కేజీల విభాగంలో కజిఖిస్థాన్‌కు చెందిన ఐగెరిం కసనవేయాను 5-0 తేడాతో చిత్తు చేసింది. తద్వారా స్వర్ణ పతకం సాధించింది. ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన కోమ్‌ ఈ ఏడాదిలో మూడో బంగారాన్ని సాధించుకుంది. 
mary kom
 
అలాగే సిలేసియన్‌ ఓపెన్‌ పోలిష్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత అమ్మాయి జ్యోతి గులియా పసిడి పంచ్‌ విసిరింది. యూత్‌ కేటగిరి ఫైనల్లో జ్యోతి.. స్థానిక బాక్సర్‌ తాతియానాను చిత్తుచేసి స్వర్ణం సాధించింది. ఇక, భారత సీనియర్‌ మహిళా బాక్సర్‌ సరితా దేవి (60 కి) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో 0-5తో కరీనా (కజకిస్థాన్‌) చేతిలో సరిత ఓడింది. 
 
మరో ఇద్దరు భారత బాక్సర్లు లవ్లీనా బొర్గైన్‌ (69 కి), పూజా రాణి (81 కి) సెమీ‌స్‌లో ఓడి కాంస్యాలు అందుకున్నారు. కాగా, ఈ టోర్నీలో భారత జూనియర్లు ఓవరాల్‌గా 13 పతకాలు (6 స్వర్ణాలు, 6 రజతాలు, ఓ కాంస్యం) కొల్లగొట్టారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

యూఎస్ ఓపెన్- అనుచితంగా ప్రవర్తించిన సెరెనా విలియమ్స్.. భారీ షాక్

అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో ఆమెకు ఊహించని ...

news

సానియా మీర్జా వేధింపులకు గురైందా..?

మహిళలకు రక్షణ కరువైంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. ...

news

ముచ్చటగా మూడోసారి.. పీట్ సంప్రాస్ సరసన నోవాక్ జకోవిచ్

యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ మూడోసారి ముచ్చటగా ...

news

యూఎస్ ఓపెన్ నుంచి రాఫెల్ నాదల్ నిష్క్రమణ

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ నుంచి స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ ఊహించని రీతిలో నిష్క్రమించాడు. ...

Widgets Magazine