శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (12:07 IST)

మైకేల్ షుమాకర్‌కు పక్షవాతం.. మాటల్లేవు.. సైగలే పాపం!

స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మంచంపట్టిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. తాజాగా అతనికి పక్షవాతం సోకగా, పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమైనట్టు షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ వెల్లడించారు. 
 
"అతను వీల్‌చైర్‌‌కే పరిమితం అయ్యాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అర్థం కావడం లేదు" అని ఫిలిప్ చెప్పారు.
 
11(డిసెంబర్ 2013) నెలల క్రితం అతడు స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో తలకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. 
 
కాగా షూమాకర్ ‘గతం కంటే కాస్త అతని ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు అనిపించింది. అయితే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది' అని చెప్పారు.