శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 13 ఆగస్టు 2014 (11:11 IST)

ధ్యాన్ చంద్‌ ఉన్నట్టు ఇప్పటికైనా గుర్తించారు.. మిల్కా సింగ్!

భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అనే క్రీడా దిగ్గజం ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి, దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డుకు ఆయన పేరును సిఫారసు చేయడం సంతోషంగా ఉందని అథ్లెటిక్ దిగ్గజం మిల్కా సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
 
మేజర్ ధ్యాన్‌ చంద్ పేరును దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించడంపై మిల్కాసింగ్ స్పందిస్తూ.. భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారునిగా ధ్యాన్‌ చంద్ పేరు ఉండాల్సిందనీ, కనీసం ఇప్పుడైనా అతని సేవలు గుర్తించినందుకు సంతోషంగా ఉందని మిల్కా అన్నాడు. హోం మంత్రిత్వ శాఖ ధ్యాన్‌ చంద్ పేరును నామినేట్ చేసిందని తెలియగానే చాలా ఆనందమేసిందన్నారు. 
 
హాకీలో అసమాన ప్రతిభాపాటవాలతో దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడని గుర్తు చేశాడు. భారతరత్న అందుకున్న తొలి ఆటగాళ్లలో అతని పేరు ముందుండాలని ఎప్పుడూ అనుకునేవాణ్ని. ధ్యాన్‌ చంద్‌ను నామినేట్ చేశారన్న నిర్ణయంతో జాతి యావత్తు హర్షిస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నట్టు మిల్కా సింగ్ చెప్పుకొచ్చారు.