గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:45 IST)

అర్టెంటీనా ఓపెన్‌ను తొలిసారిగా గెలిచిన రఫెల్ నాదల్!

టెన్నిస్లో స్పానిష్ టాప్ సీడ్ రఫెల్ నాదల్ 2015లో తొలి బోణి కొట్టాడు. అర్జెంటీనా ఓపెన్ను కైవసం చేసుకున్నాడు. స్థానిక ఆటకాడు జువాన్ మోనాకోపై 6-4, 6-1 తేడాతో ఈ విజయం సాధించాడు. బ్యూనస్ ఎయిర్స్లోని లాన్ టెన్నిస్ క్లబ్‌లో ఈ మ్యాచ్ ఆదివారం జరిగింది. 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనాకు చెందిన మొనాకోను నాదల్ మట్టి కరిపించాడు. 
 
ఈ విజయంతో మొత్తం 65 టైటిల్స్ను నాదల్ తన ఖాతాలో వేసుకుని ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆయన కంటె ముందువరుసలో జిమ్మి కార్నర్స్(109), ఇవాన్ లెండీ (94), రోజర్ ఫెదరర్ (84), జాన్ మెక్నోర్ (77) టైటిళ్లతో ఉన్నారు. మోనాకో జరిగిన ఫైనల్ పోరులో నాదల్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆద్యంతం మెరుగ్గా రాణించిన నాదల్ టైటిల్‌ను సొంతం చేసుకుని కొత్త రికార్డును తన ఖతాలో వేసుకున్నాడు.