శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (11:50 IST)

కోటి రూపాయలు నా శిక్షణ కోసం ఇచ్చారు.. నేను పన్ను ఎగవేయలేదు: సానియా మీర్జా

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను చెల్లించలేదని ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమన్లకు సానియా సమాధానం ఇచ్చారు. తాన

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను చెల్లించలేదని ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమన్లకు సానియా సమాధానం ఇచ్చారు. తాను సేవా పన్ను ఎగవేయలేదని సానియా స్పష్టం చేశారు. ఈ మేరకు తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సానియా మీర్జా ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమస్లను సమాధానం ఇచ్చుకున్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం 2014 జులైలో సానియాను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడరుగా ప్రకటించి ప్రధాన టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు వీలుగా శిక్షణ కోసం కోటి రూపాయలు ఇచ్చిందని చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసుట్యాక్స్ అధికారులకు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
 
సానియాకు శిక్షణగానే ఆ మొత్తం వచ్చిందే కానీ.. తెలంగాణ బ్రాండ్అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు టి.సర్కారు ఆ డబ్బు ఇవ్వలేదని చార్టర్డ్ అకౌంటెంటు తెలిపారు. సర్వీసు ట్యాక్స్ అధికారులు మాత్రం తెలంగాణ సర్కారు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది.