మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (16:11 IST)

ఒలింపిక్స్ విజేతలు తమ మెడల్స్ ఎందుకు కొరుకుతారో తెలుసా?

ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు

ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి విజేతలుగా నిలిచే వారికి బంగారు పతకాలు (మెడల్స్)ను ప్రదానం చేస్తుంటారు. ఆ పతకాలను మెడలో ధరించిన తర్వాత వాటిని తమ అభిమానులకు చూపుతూ చిరునవ్వులు చిందిస్తూ వాటిని కొరుతూ ఫోటోలకు ఫోజులిస్తుంటారు.
 
అయితే, క్రీడా విజేతలు ఆవిధంగా చేయడానికి కారణాలు బాగానే ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికిగాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం.
 
ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ అభిప్రాయపడుతూ పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారన్నారు.