ఉమ్రా యాత్రలో సానియా దంపతులు.. భవిష్యత్‌ టెన్నిస్ క్రీడాకారులు వాళ్లే..

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు ముస్లింల పవిత్ర స్థలం ఉమ్రా యాత్రకు వెళ్లారు. సానియా మీర్జా దంపతులు తమ తల్లిదండ్రుల కలిసి ఈ యాత్రకు వెళ్లారు.

selvi| Last Updated: బుధవారం, 16 మే 2018 (09:22 IST)
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు ముస్లింల పవిత్ర స్థలం ఉమ్రా యాత్రకు వెళ్లారు. సానియా మీర్జా దంపతులు తమ తల్లిదండ్రుల కలిసి ఈ యాత్రకు వెళ్లారు. 
 
ఉమ్రా యాత్ర నిమిత్తం సానియా, తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, తల్లిదండ్రులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేరుకున్న సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఉమ్రా యాత్ర విజయవంతంగా జరగాలని, అల్లా దీవెనలు ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఫొటోలు బాగున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో సానియా మీర్జా మాట్లాడుతూ.. తనకు తర్వాత టెన్నిస్ రంగంలో ఎవరు దిగుతారో చెప్పలేనని.. అంకిత రైనా, కర్మన్ కౌర్, ప్రార్థన తంబోర్‌లు భవిష్యత్‌లో టెన్నిస్‌లో రాణిస్తారని నమ్ముతున్నట్లు తెలిపింది. వీరిని 16 ఏళ్ల నుంచి చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం అమ్మను కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా వుందని చెప్పింది.దీనిపై మరింత చదవండి :