గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (19:44 IST)

సానియా మీర్జాకు ఖేల్‌‌రత్నా : ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం

భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖేల్‌రత్న అవార్డును ప్రదానం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సానియాతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు.
 
 
క్రీడా పురస్కారాలను మొత్తం 17 మందికి కేంద్రం ప్రకటించింది. వీరిలో క్రికెటర్లు రోహిత్ శర్మ, షూటర్ జితూ రాయ్, జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్, హాకీ ఆటగాడు ఆర్పీ శ్రీజేష్, రెజ్లర్లు భజ్రంగ్, బబిత, అథ్లెట్ ఎంఆర్ పూవమ్మ, షట్లర్ కే శ్రీకాంత్, బాక్సర్ మన్‌దీప్ జంగ్రాలు ఉన్నారు. వీరంతా 2015 సంవత్సరానికి గాను అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. 
 
ద్రోణాచార్య అవార్డులను అందుకున్నవారిలో రెజ్లింగ్‌లో కోచ్ అనూప్ సింగ్, అథ్లెటిక్స్‌లో హర్బాన్స్ సింగ్, బాక్సింగ్‌లో స్వతంతర్ రాజ్, స్విమ్మింగ్‌లో నిహార్ అమీన్, పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్‌లో నవాల్ సింగ్‌లు ఉండగా, ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య అవార్డును శివ్ ప్రకాష్ మిశ్రాకు ప్రదానం చేశారు.