శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:09 IST)

క్రికెటర్ల తలదన్నిన పీవీ సింధు.. రూ.50 కోట్ల గోల్డెన్ డీల్ కుదుర్చుకుంది..

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల తెలుగు తేజం పీవీ సింధుపై రెండు తెలుగు రాష్ట్రాలూ కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. పథకం గెలిచినందుకుగాను ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా రెండు కోట్లు ఇచ్చి ఘ‌నంగా స‌త్

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన 21 ఏళ్ల తెలుగు తేజం పీవీ సింధుపై రెండు తెలుగు రాష్ట్రాలూ కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. పథకం గెలిచినందుకుగాను ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా రెండు కోట్లు ఇచ్చి ఘ‌నంగా స‌త్క‌రించింది. తాజాగా ఆమె అతి భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్టు సమాచారం. రూ.50 కోట్లతో సింధు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట‌ర్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన డీల్ సింధుని వరించింది. 
 
స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీగా సేవలందిస్తున్న ''బేస్ లైన్'' ఆమెతో మూడేళ్ల పాటు కాంట్రాక్టును కుదుర్చుకుంది. దీనికిగాను సింధుకు ఆ కంపెనీ యాభై కోట్ల భారీ మొత్తాన్ని అందించనుంది. బ్యాడ్మింట‌న్ స్టార్‌కు ఇంతటి డీల్ రావ‌డం ఇదే తొలిసారి. ఈ డీల్‌పై సింధూ సంతకం చేసిందని బేస్‌లైన్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ తుహిమ్ మిశ్రా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో పతకంతో సింధుకు ఆదరణ అమాంతం పెరిగిపోవడంతో ఆమెతో వాణిజ్య ప్రకటనల కోసం చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని ఆయన అన్నారు. 
 
ఈ ఒప్పందం ప్ర‌కారం సింధు బ్రాండ్‌కి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ ఈ కంపెనీయే చూస్తుంద‌ట. ఈ విష‌యాన్ని స్వయంగా వెల్ల‌డించిన తుహిమ్‌.. సింధుకు భారత్‌లో పెరుగుతున్న పాపులారిటీతో ఎన్నో కంపెనీలు బ్రాండింగ్ కోసం వస్తున్నాయ‌ని చెప్పారు. ఒలింపిక్స్‌ నుంచి తిరిగి రాగానే చాలామంది సింధును సంప్రదించారు. 9 కంపెనీలతో జాబితాను సిద్ధం చేశాం. వచ్చేవారం వారితో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది'' అని మిశ్రా చెప్పాడు. మూడేళ్ళ వరకు సింధు బ్రాండింగ్‌, లైసెన్సింగ్‌, వాణిజ్య ఒప్పందాల్ని బేస్‌లైన్‌ సంస్థ చూసుకుంటుంది.